Israel : ఇరాన్ అణుస్థావరాలపై దాడికి ఇజ్రాయెల్ సిద్ధం ..అడ్డుకొన్న ట్రంప్!

ఇరాన్ అణుస్థావరాలపై వచ్చే నెలలో దాడి చేసేందుకు ఇజ్రాయెల్ (Israel ) సిద్ధమైందని, ఆఖరి నిమిషం లో ఈ ప్రణాళికను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అడ్డుకున్నారని తెలిసింది. అందులో ఇరాన్ (Iran)పై దాడికి ఇజ్రాయెల్ ఎలా సన్నద్ధమైందో వివరించింది. టెహరాన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని ఓ సంవత్సరం వెనక్కి నెట్టాలన్నది టెల్ అవీవ్ ప్రణాళిక. అయితే ఇది కార్యరూపం దాల్చాలంటే అమెరికా (America) సాయం కీలకం. ఎందుకంటే ఇరాన్ ఎదురుదాడి చేస్తే అగ్రరాజ్యం అండ తప్పనిసరి. అందుకే అమెరికా అధ్యక్షుడి ముందు ఈ ప్రతిపాదనను పెట్టింది. ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికే మొగ్గు చూపింది. అందుకే చర్చలకు ట్రంప్ పచ్చజెండా ఊపారు. దీంతో టెల్ అవీవ్ (Tel Aviv) వెనక్కి తగ్గాల్సి వచ్చింది.