రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తా : ట్రంప్
రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడంపై తమ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ట్రంప్ మొదటిసారిగా మార్`ఎ`లాగో బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్ని ప్రసంగించారు. ఆ యుద్ధం పై వచ్చిన నివేదికను పరిశీలించానని, గత రెండున్నరేళ్లలో వేలాదిమంది మరణించారని విచారం వ్యక్తం చేశారు. తాను అధికారంలోకి వచ్చిన అనంతరం రష్యా`ఉక్రెయన్ల యుద్ధాన్ని ఆపేస్తానని పేర్కొన్నారు. పశ్చిమాసియాలోనూ శాంతిస్థాపనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అమెరికా సైన్యాన్ని బలోపేతం చేయడానికి, ఆధునికీకరించడానికి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.






