అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్జ్
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టబోతున్న రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ తన పాలనవర్గం కూర్పును వేగవంతం చేశారు. ఇప్పటికే పలు కీలక బాధ్యతలను నియామకాలు చేపట్టిన ఆయన, తాజాగా అమెరికా తదుపరి జాతీయ భద్రత సలహాదారుగా కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్‌ను నియమించినట్లు తెలిసింది. అమెరికా ఆర్మీలోని ప్రత్యేక భద్రతా దళం అయిన గ్రీన్ బెల్ట్‌లో ఆర్మీ కల్నల్‌గా పదవీ విరమన చేసిన వాల్జ్ 2019 నుంచి ప్రతినిధుల సభలో సభ్యుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఇండియా కాకస్‌కు సహ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు.






