America: తక్షణమే దేశం విడిచి వెళ్లిపోండి .. లేకుంటే రోజుకు రూ.86 వేల జరిమానా!

అమెరికాలో అక్రమ వలసదారుల (Illegal immigrants ) పై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం స్వయంగా దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తోంది. తక్షణమే దేశం వీడాలని, లేదంటే చర్యలు తప్పవని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (Department of Homeland Security) నుంచి ఆదేశాలు వెలువడుతున్నట్లు సమాచారం. ఆదేశాలు వచ్చిన తర్వాత దేశాన్ని వీడకుంటే రోజుకు రూ.86 వేల జరిమానా విధించనున్నారట. జరిమానా చెల్లించకుంటే వారి ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్రమ వలసదారులపై మరింత దూకుడుగా వ్యవహరిస్తున్న హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ద్వారా నమోదు చేసుకొని వెళ్లిపోవాలని సూచిస్తోంది. స్వీయ బహిష్కరణ సురక్షితమని, లేదంటే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డీహెచ్‌ఎస్ అధికార ప్రతినిధి ట్రిసియా మెక్‌లాలిన్ (Tricia McLaughlin) మీడియాతో పేర్కొన్నారు. తుది ఆదేశాలు అందుకున్న తర్వాత కూడా దేశం వీడిపోకుంటే భారీ జరిమానా తప్పదన్నారు.