Trump Brand గురుగ్రామ్‌లో రూ.2200 కోట్లతో ట్రంప్ విలాస గృహాలు

ట్రంప్ బ్రాండ్ (Trump Brand )కింద గురుగ్రామ్ (Gurugram)లో అల్ట్రా -లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ నిర్మించనున్నట్లు రియల్టీ సంస్థలు ఎం3ఎం గ్రూప్ స్మార్ట్ వరల్డ్ డెవలపర్స్, ట్రైబెకా డెవలపర్స్ (Tribeca Developers) వెల్లడిరచాయి. దీనిపై రూ.2,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలిపాయి. ఈ ప్రాజెక్టులో 12 లక్షల చ.అ.లతో 288 యూనిట్లను విక్రయించనున్నారు. ఇది అయిదేళ్లలో పూర్తవుతుందని, సుమారు రూ.3,500 కోట్ల ఆదాయం రావచ్చని అంచనా వేస్తున్నట్లు స్మార్ట్‌వరల్డ్ డెవలపర్స్ సహ వ్యవస్థాపకుడు పంజ్ బన్సల్ (Panj Bansal) తెలిపారు. చ.అ.కు రూ.27,000 రేటుతో ఒక్కొక్క అపార్ట్‌మెంట్ (Apartment) ధర రూ.8 కోట్ల నుంచి రూ.12 కోట్ల వరకు ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రాండ్‌కి ఆ దేశం వెలుపల భారత్ అతి పెద్ద రియల్టీ మార్కెట్‌గా మారింది. భారత్‌లో ట్రంప్ బ్రాండ్‌కి ట్రైబెకా డెవలపర్స్ సంస్థ అధికారిక ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. ట్రంప్ ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా, ఈ ఒప్పందం 6-8 నెలల క్రితమే కుదిరినట్లు ట్రైబెకా తెలిపింది.