Tahawwur Rana :భారత్‌కు తహవ్వుర్ రాణా.. అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో

అమెరికా నిర్బంధంలో ఉన్న ముంబయి ఉగ్రదాడి కేసు నిందితుడు తహవ్వుర్ హుస్సేన్ రాణా (Tahawwur Hussain Rana)ను భారత్‌కు ప్రత్యేక విమానంలో తీసుకున్నారు. గురువారమే అతను భారత్ (India)కు చేరుకుంటాడని అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. రాణా అప్పగింతకు న్యాయ సంబంధమైన అవరోధాలన్నీ తొలగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 26/11 దాడిగా ప్రసిద్ధమైన ముంబయి ఉగ్రదాడికి (Mumbai terror attack) రాణా సూత్రధారిగా వ్యవహరించాడు.
2008లో నవంబరు 26న జరిగిన ఈ దాడిలో 10 మంది ఉగ్రవాదులు ముంబయిలోని వివిధ ప్రాంతాల్లో విచక్షణా రహితంగా కలుపలు జరిపి 166 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. అమెరికా (America) తనను భారత్‌కు అప్పగించకుండా నిరోధించేందుకు అందుబాటులో ఉన్న అన్ని న్యాయ మార్గాలనూ రాణా ఉపయోగించుకన్నాడు. చివరగా తన అప్పగింతను నిరోధించాల్సిదిగా కోరుతూ సమర్పించిన దరఖాస్తును అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల తిరస్కరించింది. ముంబయి దాడులు జరిగిన ఏడాది అనంతరం 2009 అక్టోబరులో రాణా అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ చేతికి చిక్కి లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధంలో ఉన్నాడు.