Florida : ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ లో కాల్పుల కలకలం

అమెరికాలోని ఫ్లోరిడా (Florida )లోని తలహసీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ (Florida State University ) లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులకు పాల్పడిన అనుమానితుడిని పోలీసులు (Police) అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిగిన సమయంలో వందల మంది విద్యార్థులు (Students) క్యాంప్‌లోనే ఉన్నారు.