Ukraine: ఈ వారంలోనే ఉక్రెయిన్ ఒప్పందం!

ఉక్రెయిన్, రష్యాలు యుద్ధం విరమణపై తొందరగా ఒక ఒప్పందానికి రాకపోతే శాంతి ఒప్పందం కుదిర్చే ప్రయత్నాల నుంచి విరమించుకుంటామని చెప్పిన అమెరికా (America), ఇప్పుడు ఈ వారంలోనే యుద్దం ఆగే అవకాశాలున్నాయని ఆంటోంది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా(Russia), ఉక్రెయిన్ (Ukraine) ల మధ్య శాంతి ఒప్పందం ఈ వారంలోనే కుదిరే అవకాశం ఉందంటూ డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ రెండు దేశాలు తమతో కలిసి భారీగా వ్యాపారం చేయబోతున్నా యని కూడా పేర్కొన్నారు. వ్యాపార ఒప్పందాల నుంచి ఆ దేశాలు తమతో కలిసి సంపద గడిస్తాయని వ్యాఖ్యానించారు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ అభివృద్ధికి ఇవి దోహదపడతాయన్నారు. అయితే శాంతి చర్చల పురోగతిపై ట్రంప్ ఎలాంటి వివరాలను వెల్లడిరచలేదు.