డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలకు సిద్ధం : పుతిన్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఎన్నికల్లో విజయానికి ట్రంప్‌ను అభినందించారు. ట్రంప్‌ను దైర్యశాలిగా అభివర్ణించారు. సోచిలో ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. వైట్‌హౌస్‌లో తొలి విడతలో ట్రంప్ అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు ఎదుర్కొన్నారని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముగింపు పలకగలమని ట్రంప్ అనడంపై స్పందిస్తూ కనీసం దృష్టి పెట్టాల్సిన అంశమిదని అన్నారు. జూలైలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం పై మాట్లాడుతూ ఆయనపై ఒక అభిప్రాయానికి రావడానికి ఇది దోహదపడిరదని పేర్కొన్నారు. కాల్పులు జరిగి చెవి నుంచి రక్తమోడుతున్నా, ట్రంప్ వెంటనే తేరుకొని పిడికిలి బిగించి ఫైట్, ఫైట్, ఫైట్ అని నినదించిన విషయం తెలిసిందే. దీనిపై పుతిన్ మాట్లాడుతూ ట్రంప్ చక్కగా స్పందించారు. దైర్యంగా పరిస్థితులను ఎదుర్కొన్నారు. ధీశాలి అని కితాబిచ్చారు.






