J.D. Vance : పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన జెడీ వాన్స్

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్(J.D. Vance) పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశం అయ్యారు. పోప్ (Pope)కు ఆయన ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాక ట్రంప్ (Trump) పరిపాలనలో వలస బహిష్కరణ ప్రణాళికలపై వారు విభేదాలకు గురయ్యాక ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. సెయింట్ పీటర్స్ స్క్వేర్(St. Peter’s Square) లో ఈస్టర్ మాస్ జరుగుతున్నప్పుడు వాన్స్ మోటర్‌కేడ్ వాటికన్ సిటీ (Vatican City )కి ఒక పక్క గేటు గుండా ప్రవేశించి ఫ్రాన్సిస్ హోటల్ నివాసం దగ్గర పార్క్ చేశారు. ఇదిలావుండగా ప్రాణాంతక న్యుమోనియా నుండి కోలుకోవడానికి తన పనిభారాన్ని బాగా తగ్గించుకున్న ఫ్రాన్సిస్, మాస్ వేడుకను మరొక కార్డినల్‌కు అప్పగించారు. కాగా పోప్ ఫ్రాన్సిస్, అమెరికా ఉపాధ్యక్షుడు జెడి. వాన్స్ ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకోవడానికి డోమస్ శాంటా మార్టాలో కొన్ని నిమిషాలు సమావేశమయ్యారని వాటికన్ తెలిపింది. 2019లో కాథలిక్కుగా మారిన వాన్స్ వాటికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్డినల్ పియట్రో పరోలిన్, విదేశాంగ మంత్రి ఆర్బ్ బిషప్ పాల్ గల్లాఘర్ (Archbishop Paul Gallagher)తో కూడా సమావేశమయ్యారు.