Modi : భారత్‌లో ప్రాంగణాలు ఏర్పాటు చేయండి : మోదీ

భారత్‌లో ప్రాంగణాలను ఏర్పాటు చేయాలంటూ అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు ప్రధాని మోదీ (Modi) ఆహ్వానం పలికారు. విద్యాపరంగా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి అవి దోహదపడతాయన్నారు. వాషింగ్టన్ (Washington ) లో ట్రంప్ (Trump) తో భేటీ అనంతరం సంయుక్త విలేకర్ల సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ (Los Angeles) , బోస్టన్ (Boston) లో భారత్ త్వరలోనే నూతన కాన్సులేట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారు. అంతరిక్ష రంగంలో భారత్-అమెరికా సహకారానికి సంబంధించి 2025 అగ్రగామి ఏడాదిగా నిలవబోతోందని మోదీ, ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో ఇటీవల పరిణామాలు, తాజా పరిస్థితుల గురించి ట్రంప్ తో మోదీ చర్చించారని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri) తెలిపారు.