Time list : టైమ్ జాబితాలో ట్రంప్, మస్క్ .. భారతీయులకు దక్కని చోటు

ప్రపంచంలో 2025 సంవత్సరానికి అత్యంత ప్రభావశీలురుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer), డోజ్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk), బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) , అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) నిలిచారు. వివిధ విభాగాల్లో మొత్తం 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల పేర్లతో రూపొందించిన జాబితాను టైమ్ మ్యాగజీన్ తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్కరూ లేరు. అయితే అమెరికాలో భారత సంతతికి చెందిన రేష్మ కెవల్‌రామణి చోటు దక్కించుకున్నారు. ఈమె వర్టెక్స్ ఫార్మా సీఈవోగా వ్యవహరిస్తున్నారు.