Narendra Modi :ఫిబ్రవరిలో ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ భేటీ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald trump )తో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫిబ్రవరిలో భేటీ కానున్నారు. ఇరు దేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంలో మోదీ, ట్రంప్ మధ్య ఉన్న స్నేహబంధం కీలకపాత్ర పోసించనుంది. చైనా (China) దూకుడును అడ్డుకోవడంపై ఈ భేటీలో నేతలిద్దరూ దృష్టి సారించే అవకాశముంది. ఇక భారతీయులను ఆందోళన పరుస్తున్న వలసలపై కఠిన వైఖరి, జన్మత పౌరసత్వం రద్దు తదితర అంశాలను మోదీ ప్రముఖంగా లేవనెత్తవచ్చు. హెచ్-1బీ వీసా (H1B visa )ల్లో సింహభాగం భారతీయులే దక్కించుకుంటారన్నది తెలిసిందే. అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలు మరీ ఎక్కువని పదేపదే ఆక్షేపిస్తున్న ట్రంప్ ఈ అంశాన్ని మోదీతో లేవనెత్తవచ్చు. సుంకాలను తగ్గిచడంతో పాటు అమెరికా పెట్టుబడులను మరింత ఆకర్షించే దిశగా పలు నిర్ణయాలను ఈ భేటీలో ట్రంప్ ముందుంచాలని మోదీ భావిస్తున్నారు.