ట్రంప్ ఎస్టేట్‌లో సోదాలకు నిరసనగా.. ఎఫ్‌బీఐ పై
ఫ్లోరిడాలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన మార్`ఎ`లాగో ఎస్టేట్‌లో ఇటీవల జరిగిన సోదాలను నిరసిస్తూ ఎఫ్‌బీఐ కార్యాయలంపై దాడి చేసేందుకు ప్రయత్నించిన ఓ సాయుధుడు పోలీసులు కాల్పుల్లో హతమయ్యాడు. మృతుడిని రిక్కీ షిఫర్గా గుర్తించారు. ఎఫ్‌బీఐ సోదాలకు వ్యతిరేకగా సామాజిక మాధ్యమాల్లో అతడు పలు పోస్టులు పెట్టాడు. ఆయుధాలు చేతబూని పోరాడాలని, ఎఫ్‌బీఐ ఏజెంట్లను చంపేయాలని పిలుపునిచ్చాడు. రైఫిల్‌తో సిన్సినాటిలోని ఎఫ్‌బీఐ కార్యాలయంలోకి చొరబడేందుకు అడ్డుకోవడంతో అక్కడి నుంచి పారిపోతూ కాల్పులు జరిపాడు. ఆపై జరిగిన ఎదురుకాల్పుల్లో మృత్యువాతపడ్డాడు.






