అమెరికా ఉపాధ్యక్షుడిగా తెలుగింటి అల్లుడు..
ఈసారి జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత రసవర్తనంగా కొనసాగాయి. గెలుపు ఎవరికి దక్కుతుంది అన్న టెన్షన్ పోటీ చేసిన వాళ్ళ కంటే కూడా టీవీ ముందు చూసే ప్రేక్షకులకి ఎక్కువ అన్నట్టు ఎన్నికల ఫలితాలు సాగాయి. ఇక ఈసారి ఎన్నికల్లో భారత సంతతికి చెందిన కమలా హరీస్ గెలవాలి అనే ఆకాంక్ష ఇండియన్స్ లో బలంగా కనిపించింది. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే నిజంగా కమలా హరీస్ గెలిచి ఉంటే అది ఓ చరిత్ర అయ్యేదేమో..
ఆ విషయం పక్కన పెడితే అమెరికా రాజకీయాలలో మన తెలుగువారి హవా ఉండడం విశేషం. అయితే కమల హరీష్ గెలవలేదు అనే నిరాశను మరొక అభ్యర్థి భర్తీ చేశారు. ఆ వ్యక్తి మరెవరో కాదు రిపబ్లిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన జేడీ వాన్స్. ట్రంప్ విజయోత్సవ సభలో అతన్ని కూడా అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే తెలుగు వారి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే..జేడీ వాన్స్ భార్య ఉషా చిలుకూరి.
ఉష చిలుకూరి తెలుగు కుటుంబానికి చెందిన మహిళ కావడం.. ఆమె ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఉషా తల్లి శాంతమ్మ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా చేశారు. వారి కుటుంబం అమెరికాలో స్థిరపడినప్పటికీ ఇప్పటికి కూడా వారు భారతీయ సంస్కృతి పట్ల ఎంతో గౌరవాభిమానాలతో ఉన్నారు. దీంతో ఫైనల్ గా తెలుగింటి అల్లుడు ఉపాధ్యక్షుడు కావడం ఇప్పుడు వైరల్ అవుతుంది. మరోపక్క తమ కుటుంబానికి ఈ గౌరవం కలగడం ఎంతో సంతోషకరమని శాంతమ్మ కూడా పేర్కొన్నారు.






