America: అమెరికాలో భారత వ్యాపారవేత్తకు చేదు అనుభవం

భారత యువ వ్యాపారవేత్త శ్రుతి చతుర్వేది (Shruti Chaturvedi) కి అమెరికా (America) లో చేదు అనుభవం ఎదురైంది. అలస్కా ఎయిర్‌పోర్టు (Alaska Airport) లో తనను ఎఫ్‌బీఐ (FBI) అధికారులు 8 గంటల పాటు అన్యాయంగా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. పురుషులతో తనిఖీలు చేయించారని, కనీసం వాష్‌రూమ్ కు వెళ్లేందుకు కూడా అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హ్యాండ్‌బ్యాగ్‌లోని ఓ పవర్ బ్యాంక్ (Power bank ) అనుమానాస్పదంగా కన్పించడంతో అలస్కాలోని యాంకరేజ్ ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ సిబ్బంది తనను అడ్డుకున్నారని శ్రుతి వెల్లడించారు. 8 గంటల పాటు ఓ చల్లని గదిలో నిర్బంధించారు. సీసీటీవీ (CCTV) కెమెరా రికార్డింగ్‌లో ఓ పురుష సిబ్బంది తనను తనిఖీ చేశారు. వెచ్చదనం కోసం వేసుకున్న దుస్తులు తీసేయమని చెప్పారు. మొబైల్ ఫోన్ (Mobile phone) , వాలెట్ అన్నీ తీసుకున్నారు. కనీసం వాష్‌రూమ్‌కు కూడా వెళ్లనివ్వలేదు. ఒక్క ఫోన్ కాల్ చేసుకునేందుకు అనుమతించలేదు. వీటన్నింటి కారణంగా వెళ్లాల్సిన విమానం మిస్ అయింది అని తెలిపింది. మార్చి 30న శ్రుతి చతుర్వేది అలస్కా వెళ్లి అక్కడ పలు ప్రాంతాలను సందర్శించారు. అనంతరం తిరుగు పయనం అవుతుండగా ఈ చేదు అనుభవం ఎదురైనట్లు తెలిపారు.