అమెరికా స్థానిక సంస్థల్లోనూ … భారత సంతతి పౌరులు!
అమెరికాలోని స్థానిక సంస్థలు, రాష్ట్రాల చట్టసభల ఎన్నికల్లోనూ భారత సంతతి పౌరులు తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. దాదాపు 36 మందికిపైగా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. అమెరికాల్లో అత్యంత స్వల్పంగా ఉన్న భారత సంతతి పౌరులు ఇలా కీలక ఎన్నికల్లో తలపడుతున్న పరిస్థితి, వారికి అగ్రరాజ్యం ఎన్నికలపై ఉన్న ఆసక్తిని చాటి చెబుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. కాలిఫోర్నియా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎక్కువ మంది భారత సంతతి పౌరులు పోటీ పడుతున్నారని తెలిపారు. కాలిఫోర్నియాలో దాదాపు 9 లక్షల మంది భారతీయ అమెరికన్లు నివసిస్తున్నారు.






