భారత్‌తో సంబంధాల బలోపేతానికి ట్రంప్ కృషి : లీసా కర్టిస్ కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక భారత్‌తో సంబంధాల బలోపేతానికి డొనాల్డ్ ట్రంప్ కృషి చేస్తారని ఆయన మాజీ సహాయకురాలు లీసా కర్టిస్ పేర్కొన్నారు. మొదటి దఫా పదవీకాలంలో అసంపూర్తిగా ఉండి పోయిన ద్వైపాక్షిక అంశాలను రెండో దఫలో పూర్తిచేసేందుకు ఆయన ప్రయత్నిస్తారని తెలిపారు. 2017`21 మధ్య అమెరికా అధ్యక్షుడి డిప్యూటీ సహాయకురాలిగా, దక్షిణ`మధ్య ఆసియా ఎన్ఎస్ఏ సీనియర్ డైరెక్టర్ పనిచేసిన లీసా తాజాగా మీడియాతో మాట్లాడారు. భారత్ విషయంలో ట్రంప్ సానుకూల దృక్పథం ఉంది. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ట్రంప్, మోదీ మధ్య మంచి స్నేహం ఉంది. ఆ మైత్రితో చాలా పురోగతి సాధ్యమైంది అని పేర్కొన్నారు. అయితే సుంకాల వంటి కొన్ని అంశాల్లో ట్రంప్‌తో భారత్‌కు సమస్యలూ తప్పవనీ లీసా అభిప్రాయపడ్డారు.






