Kash Patel : హ్యాపీ కి శిక్ష పడేలా చేస్తాం ఎఫ్‌బీఐ అధిపతి కాష్ పటేల్

అమెరికాలో పట్టుబడిన పంజాబ్ గ్యాంగ్‌స్టర్, ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ హ్యాపీ పాసియా (Happy Passia) అలియాస్ జోరా (29)కు శిక్ష పడేటట్లు చేస్తామని ఎఫ్‌బీఐ అధిపతి కాష్ పటేల్ (Kash Patel) భరోసా ఇచ్చారు. అమెరికా (America)లో అక్రమంగా నివసిస్తున్న విదేశీ ఉగ్రవాద ముఠాకు చెందిన హర్‌ప్రీత్ సింగ్ (Harpreet Singh) పట్టుబడ్డాడు. అమెరికా, భారత్ (India)లో పలు పోలీసు స్టేషన్ల పై దాడులకు కుట్ర పన్నిట్లు అనుమానాలు ఉన్నాయి. దీనిపై మేము స్థానిక భాగస్వాములు, భారత్‌లోని సంస్థలతో సమన్వయం చేసుకొని దర్యాప్తు చేస్తాం. అధికారులు అద్భుతంగా పనిచేశారు. న్యాయం లభిస్తుంది. హింసను వ్యాపించేవారు ఎక్కడ ఉన్నా ఎఫ్‌బీఐ వదిలిపెట్టదు అని ఆయన పేర్కొన్నారు.