నిక్కీ హేలీకి షాక్… ఆధిక్యంలో ట్రంప్
వచ్చే ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున నామినేషన్‌కు పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ నేత నిక్కీ హేలీ సొంతరాష్ట్రమైన దక్షిణ కరోలినాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో 53శాతం మంది తాము ట్రంప్‌నకు బాసటగా నిలుస్తామని తెలిపారు. 22 శాతం మంది మాత్రం హేలీకి మద్దతు ప్రకటించారు. మరో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి ఒక్క శాతం మందే మద్దతుగా నిలిచారు. ప్రైమరీల ఎన్నికలు ముందుగా జరిగే రాష్ట్రాల్లో దక్షిణ కరోలినా కూడా ఉంది. ప్రస్తుత మద్దతుదారులతో మాట్లాడినప్పుడు తాము తిరిగి ట్రంప్‌నకే మద్దతు ఇస్తామని 82 శాతం మంది తెలిపారు. హేలీ విషయంలో 42 శాతం మంది, డిశాంటిస్‌కు 38 శాతం మంది ఈ రీతిలో స్పందించారు.






