Vizag: విశాఖపట్నంలో ఉత్సాహంగా జరిగిన ఎస్బీఐ గ్రీన్ మారథాన్ సీజన్ 6
ఎస్బీఐ గ్రీన్ మారథాన్ సీజన్ 6 ఇప్పుడు అద్భుతమైన విశాఖ సముద్రతీరం — సిటీ ఆఫ్ డెస్టిని లో విజయవంతంగా సాగింది. రామకృష్ణ బీచ్ వద్దనున్న ప్రసిద్ధ విఎంఆర్డిఏ పార్కు, వేలాది మంది రన్నర్లతో, పర్యావరణ ప్రేమికులతో నిండిపోయి — ఫిట్నెస్, సంఘ బలం మరియు సస్టైనబిలిటీకి ప్రతీకగా మారింది. విశాఖపట్నం మారథాన్ కి ముందు లక్నో, చండీగడ్ మరియు భోపాల్ వంటి నగరాల్లో కూడా ఉత్సాహంగా గత వారాలలో నిర్వహించడం జరిగింది.
నీలిరంగు సముద్ర తీరం, సుసంపన్నమైన ప్రకృతి, పర్యావరణమైన దృక్పథం కలిగిన విశాఖపట్నం ఈ మారథాన్ ఆలోచనగా ఉన్న – “రన్ ఫర్ గ్రీనర్ ఇండియా” కు అర్థవంతమైన వేదికగా నిలిచింది.
3,900 మందికి పైగా పాల్గొనగా — ఫిట్నెస్ ప్రేమికులు, కుటుంబాలు, భారత నౌకాదళం మరియు రక్షణ బలగాల ప్రతినిధులు — అందరూ ఒకే లక్ష్యంతో పరిగెత్తారు: తమ కోసం కాదు, భూమి కోసం.
మారథాన్‌ను ఎస్బీఐ ప్రముఖులు — శ్రీ రాహుల్ సంకృత్యా, ఉప ప్రధాన మేనేజర్ మరియు శ్రీ కె. ఉమా మహేశ్వరరావు, ప్రజాసంబంధాధికారి – జెండా ఊపి ప్రారంభించారు. వారి సమక్ష్యం ఎస్బీఐ భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన, సుస్టేనబుల్ భవిష్యత్తు వైపు తీసుకెళ్లాలనే వాగ్దానాన్ని మరోసారి నొక్కి చెప్పింది.
సుస్టేనబిలిటీకి కట్టుబడి, ఎస్బీఐ గ్రీన్ మారథాన్ ప్రతి దశలో పర్యావరణహిత చర్యలను అమలు చేసింది.
ఆర్గానిక్ టీ-షర్ట్ లు, మొలిచే బీబ్ నంబర్లు మరియు పునర్వినియోగ కాటన్ వస్త్రం గూడీ బ్యాగులు ద్వారా జీరో వేస్ట్ కాన్సెప్ట్‌ను ప్రోత్సహించింది.
బ్లాక్ అల్కలైన్ వాటర్ వ్యవస్థ ద్వారా రన్నర్లకు హైడ్రేషన్ మరియు రికవరీ సపోర్ట్ అందించింది.
వ్యర్థ నిర్వహణ భాగస్వామ్య సంస్థ ఎస్కేఆర్ఏపి ద్వారా వ్యర్థాలను వర్గీకరించడం, రీసైక్లింగ్ మరియు బాధ్యతాయుత పారవేసివేత వంటి ప్రక్రియలు నిర్దేశించబడ్డాయి, ఫలితంగా సమగ్ర సస్టెయినబిలిటీ రిపోర్ట్ రాబోతుంది.
ఈ ఉత్సాహభరిత కార్యక్రమంలో మిర్చి రేడియో జాకి ప్రేమ్ జోష్, మాటలు మరియు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే శైలితో వాతావరణాన్ని మరింత రసవత్తరంగా మార్చారు.
5కే, 10కే, 21కే విభాగాల్లో జరిగిన ఈ ఏఐఎంఎస్ సర్టిఫైడ్ మారథాన్‌లో రక్షణ బలగాలు, ప్రొఫెషనల్ అథ్లెట్లు, రన్నింగ్ గ్రూపులు మరియు తొలిసారి పాల్గొన్న పరుగుదారులు — అందరూ సస్టెనబిలిటీ సందేశం కింద ఏకమయ్యారు.
సముద్రతీరంలోని అందాల నడుమ, ఉదయపు మృదువైన గాలి, ఉదయసూర్య కిరణాల సాక్షిగా జరిగిన ఈ రన్ విశాఖలో ప్రకృతి-మానవ అభివృద్ధి కలయికకు ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది.
ప్రతి అడుగు, ప్రతి శ్వాస, ప్రతి హృదయమొట్టు — పచ్చని భారత్ కోసం అనే సంకల్పాన్ని మరోసారి బలపరిచింది. ప్రారంభ సమయంనుంచి, Eco-Friendly గూడీ బాగ్స్ మరియు పోస్ట్-రన్ యాక్టివిటీస్ వరకు — ఇది నగరానికి ఒక పచ్చటి గుర్తు.
ఎస్బీఐ గ్రీన్ మారథాన్ సీజన్ 6 విశాఖపట్నం రన్ విజయవంతంగా ముగియడంతో, భారతదేశాన్ని పచ్చగా, పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో తన 17 నగరాల ప్రయాణంలో తదుపరి అడుగు వేస్తోంది. ఎందుకంటే ఒక పచ్చని రేపటి కోసం ప్రతి అడుగు విలువైనది.






