డెమోక్రాట్లను ఆదుకోండి.. మద్దతుదారులకు ట్రంప్ విజ్ఞప్తి
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాట్ల విరాళాలపై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు స్థాయిలో విరాళాలు సేకరించి పోరాడిన డెమోక్రాట్ల వద్ద డబ్బు లేక పోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ క్లిష్ట సమయంలో వారికి ఆర్థిక సాయం అందించాలని నా మద్దతుదారులను కోరుతున్నాం అంటూ ట్రంప్ స్పందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో కమలా హారిస్ 1 బిలియన్ డాలర్లకు పైగా ప్రచార విరాళాలను సేకరించారు. అయినా ఎన్నికలు ముగిసే సమయానికి 20 మిలియన్ డాలర్ల అప్పుల్లో ఉన్నట్లు తెలిసింది. విక్రేతలకు, సిబ్బందికి సంబంధించిన చెల్లింపుల్లో అమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు.






