అమెరికా అటార్నీ జనరల్‌గా మ్యాట్ గేజ్
తనకు అత్యంత విధేయుడిగా పేరొందిన అమెరికా పార్లమెంట్ సభ్యుడు మ్యాట్ గేజ్‌ను తదుపరి అమెరికా అటార్నీ జనరల్‌గా ఎంపిక చేశారు. ఫ్లోరిడా నుంచి అమెరికా కాంగ్రెస్‌కు సేవలందిస్తున్న మ్యాట్ గేజ్‌ను అటార్నీ జనరల్‌గా నియమించడం గౌరవంగా భావిస్తున్నా. విపక్ష నేతలపైకి న్యాయ వ్యవస్థను ఆయుధంగా వాడేపెడపోకడకు గేజ్ ముగింపు పలుకు తారని భావిస్తున్నా సరిహద్దులను కాపాడుతూ, నేరముఠాల పనిపట్టి, న్యాయ వ్యవస్థపై అమెరికన్లలో సన్నగిల్లిన నమ్మకానిన గేజ్ మళ్లీ పెంచుతారని ఆశిస్తున్నా. జస్టిస్ డిపార్ట్మెంట్లోని వ్యవస్థాగత అవినీతిని గేజ్ అంతమొందిస్తారు అని ట్రంప్ ప్రకటించారు. విలియం అండ్ మేరీ కాలేజ్ ఆఫ్ లాలో పట్టభద్రుడైన గేజ్ అమెరికా న్యాయవ్యవస్థలో సంస్కరణ కోరుకునే వ్యక్తిగా పేరొందారు.






