Donald Trump :భారత్‌పై 26 శాతం సుంకం … ప్రకటించిన ట్రంప్

ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రకటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నుంచి వెలువడిరది. ప్రపంచ దేశాలన్నీ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చ ని, అయితే కనీసం 10 శాతం సుంకం చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న ఇతర దేశాలపై మాత్రం, ఆయా దేశాలు విధిస్తున్న సుంకాల్లో సగం మేర తాము విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. భారత్ (India) తమ ఉత్పత్తులపై 52శాతం సుంకం విధిస్తున్నందున, తాము 26 శాతం సుంకం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్థరాత్రి దాటాక 1:30 గంటలకు ( అమెరికా కాలామానం ప్రకారం బుధవారం సాయంత్రం 4 గంటలకు) వాషింగ్టన్ డీసీలోని వైట్‌హౌజ్ రోజ్‌గోర్డెన్ (Rosegarden) లో తన క్యాబినెట్ సహచరుల సమక్షంలో ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న ప్రతీకార సుంకాలను వెల్లడిరచారు. వీటికి సంబంధించిన అధికారిక ఆదేశాలపై సంతకం చేశారు. చైనా, జపాన్(, Japan), థాయ్‌లాండ్ (Thailand) , వియత్నాం, భారత్ తమపై అధిక సుంకాలు విధిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అమెరికా పౌల్ట్రీ ఉత్పత్తులపై ఐరోపా కూటమి అనుసరిస్తున్న తీరును ట్రంప్ విమర్శించారు. వాహనాలు, వాహన విడిభాగాలపై 25 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు తెలిపారు.