130 ఏళ్ల తర్వాత తొలి మరణశిక్ష
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూర్చి దిగబోయే ముందు ఓ అరుదైన రికార్డు సృష్టించారు. 40 ఏళ్ల బ్రాండన్ బెర్నార్డ్ అనే వ్యక్తికి కోర్టు విధించిన మరణశిక్షను ట్రంప్ యంత్రాంగం అమలు చేసింది. 18 సంవత్సరాల వయస్సులో బెర్నార్డ్ ఓ నేరానికి సహచరుడిగా వ్యవహరించినందుకు గాను అతనికి కోర్టు ఉరిశిక్ష విధిస్తూ.. తీర్పు నివ్వగా దాన్ని అమలు చేశారు. ఇది ఈ సంవత్సరంలో ఫెడరల్ ప్రభుత్వం అమలు చేసిన తొమ్మిదవ ఉరిశిక్ష. అయితే రికార్డు ఏంటంటే 130 ఏళ్ల తర్వాత లేమ్ డక్ కాలంలో అమలు చేసిన తొలి మరణశిక్ష బెర్నార్డ్ది కావడం విశేషం.
రెండు దశాబ్దాల క్రితం టెక్సాస్‌కు చెందిన ఓ స్ట్రీట్ గ్యాంగ్ అయోవాలో ఓ జంటను హత్య చేసింది. 2000 సంవత్సరంలో జరిగిన ఈ దారుణంలో బెర్నార్డ్, క్రిస్టోఫర్ వియాల్వా అనే మరో వ్యక్తితో కలిసి ఈ హత్యకు పాల్పడ్డట్లు తెలిసింది. ఈ గ్యాంగ్‌లో బెర్నార్డ్ కూడా ఉన్నాడు. దాంతో కోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఇక ఇండియానా టెర్రె హాట్‌లోని ఫెడరల్ జైలులో బెర్నార్డ్‌కు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చిన మరణశిక్ష అమలు చేశారు.






