US Embassy : ఎఫ్.ఎమ్.జే తరహా వీసాలపై .. అమెరికా ఎంబసీ సూచన
ఎఫ్, ఎమ్, జే తరహాల నాన్ ఇమ్మిగ్రెంట్ అమెరికా వీసాలు పొందాలనుకునేవారు తమ సోషల్ మీడియా అకౌంట్ల ప్రైవసీ సెట్టింగ్‌లను పబ్లిక్‌గా మార్చుకోవాలని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) పేర్కొంది. ఇలా చేయడం ఆయా వీసా(Visa)లు పొందాలని కోరుకునే వారి గుర్తింపును, అర్హతను రూఢ చేసుకోడానికి వీలు కలిగిస్తుందని రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికన్ చట్టాల ప్రకారం ఇలా చేయడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇమిగ్రెంట్ (Immigrant), నాన్ ఇమ్మిగ్రెంట్ (non-immigrant) వీసాలు కోరుకునేవారు తమ సోషల్ మీడియా (Social media) గుర్తింపు సూచికల్ని దరఖాస్తుల్లో పొందుపరచాలన్న నియమం 2019 నుంచీ అమలులో ఉందని రాయబార కార్యాలయం గుర్తుచేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక ఒక ప్రకటన వెలువరించింది. అమెరికాలో ప్రవేశించడానికి అర్హతలేని వారిని గుర్తించడానికి మేం అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటాం అని అమెరికా రాయబార కార్యాలయం ఆ ప్రకటన వివరించింది.






