MATA: మిన్నెసోటా తెలంగాణ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్ (MATA) 2026 సంవత్సరానికి గాను తమ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా విక్రాంత్ రెడ్డి కటంగురి బాధ్యతలు చేపట్టారు. ఈ కొత్త బృందం మన సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడమే కాకుండా, కమ్యూనిటీ సభ్యుల మధ్య ఐక్యతను పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు.
నూతనంగా ఎంపికైన ప్రధాన కార్యవర్గ సభ్యుల వివరాలు:
అధ్యక్షుడు: విక్రాంత్ రెడ్డి కటంగురి
ఉపాధ్యక్షుడు: సందీప్ పాతూరి
ప్రధాన కార్యదర్శి: సమీర మంధాల
కోశాధికారి: రాహుల్ నీల
జాయింట్ సెక్రటరీ: సరిత పగిడిమర్రి
మార్కెటింగ్ & వాలంటరీ: సంతోష్ లంక
భవిష్యత్ ప్రణాళికలు, లక్ష్యాలు
నూతన అధ్యక్షుడు విక్రాంత్ రెడ్డి కటంగురి 2026 సంవత్సరానికి గాను తన దార్శనికతను పంచుకున్నారు. ప్రధానంగా తెలంగాణ వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించడం, యువతకు వారి మూలాలతో అనుసంధానం ఏర్పరచడం, ఇతర సంఘాలతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరించడంపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ కార్యవర్గంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఎక్స్టెండెడ్ బోర్డ్, అడ్వైజరీ బోర్డ్ సభ్యులు కలిసి సమన్వయంతో పనిచేయనున్నారు.






