AB Venkateswara Rao: వారితో కలిసి త్వరలోనే ఓ రాజకీయ పార్టీ పెడతాం : ఏబీ వెంకటశ్వరావు
రాష్ట్ర పురోగతి కోసం నా ఆలోచనలకు తగ్గట్టుగా ఉండే వారితో కలిసి త్వరలోనే ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తామని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరావు (AB Venkateswara Rao) తెలిపారు. విజయవాడ (Vijayawada)లోని సిద్థార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన సంక్రాంతి ఆత్మీయ కలయికలో వెంకటేశ్వరరావు మాట్లాడారు. గత ఏప్రిల్ 13న రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్టు ప్రకటించాను. అప్పటి నుంచి అదే పనిమీద ఉన్నా. అందుకు తగిన ఆర్థిక శక్తిని సమకూర్చుకుని, త్వరలోనే పార్టీ (Party)ని పెడతాను అని ప్రకటించారు. స్వేచ్ఛగా అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలను చెప్పేందుకు విజయవాడ (Vijayawada)లో ఓ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. అమెరికా (America) లాంటి దేశాలు చిన్న దేశాలపై దాడులు చేస్తున్న ఈ సమయంలో భారతదేశం బలంగా నిలబడాలన్నారు. దేశాభివృద్ధి అంటే కార్పొరేట్ శక్తులు అభివృద్ధి చెందడం కాదని, ప్రజలందరూ అభివృద్ధి చెందాలని అభిప్రాయపడ్డారు.






