Anand Kuchibotla: ఆనంద్ కూచిభొట్లకు ‘50 హీరోస్ ఓవర్ 50’ అరుదైన గౌరవం..
సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్, ఆరియా యూనివర్సిటీ ప్రెసిడెంట్ ఆనంద్ కూచిభొట్ల ఒక విశిష్టమైన గుర్తింపును పొందారు. ఈ పాడోసి (ePadosi) సంస్థ ప్రకటించిన ‘50 హీరోస్ ఓవర్ 50’ (50 Heroes Over 50) జాబితాలో ఆయన ఒకరుగా నిలిచారు. అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ అభివృద్ధికి, సంస్కృతుల మధ్య వారధిగా ఉంటూ అద్భుతమైన కృషి చేసిన 50 మంది ప్రవాస భారతీయులను ఈ వార్షిక పురస్కారం ద్వారా గౌరవిస్తారు.
తమ సృజనాత్మకత, పట్టుదలతో వివిధ రంగాల్లో మార్పులు తీసుకువస్తూ, ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీని బలోపేతం చేస్తున్న వారిని గుర్తించి ఈ గౌరవాన్ని అందజేస్తారు. ఈ సందర్భంగా ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, తనకు లభించిన ఈ గౌరవాన్ని సిలికానాంధ్ర కుటుంబానికే అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పురస్కారాన్ని అందించినందుకు ఈ పాడోసి బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.






