Sammakka: :సమ్మక్క, సారలమ్మ వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మహా జాతరను విజయవంతంగా నిర్వహించి వనదేవతలు సమ్మక్క, సారలమ్మల వైభవాన్ని ప్రపంచానికి చాటుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే ఉత్సవాల ఏర్పాట్లు, గద్దెల పునర్నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy), ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Duddilla Sridhar Babu), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ల (Adluri Lakshman Kumar)తో కలిసి ఆయన మేడారాన్ని సందర్శించారు. స్థానిక హరిత హోటల్ లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ రూ.251 కోట్లు వెచ్చించి గద్దెల ప్రాంగణం పునరిన్నర్మాణ పనులను చేపడుతున్నామన్నారు. రెండ్రోజుల్లో పన్నులనీ పూర్తవుతాయన్నారు.






