LATA: లాటా గాలిపటాల పండుగ, సంక్రాంతి సంబరాలు
లాటా ఆధ్వర్యంలో మన సంస్కృతి, సంప్రదాయాల కలయికతో నిండిన సంక్రాంతి వేడుకలు ఎంతో కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన ముగ్గులు మన తెలుగు వారి సృజనాత్మకతకు అద్దం పట్టాయి. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా, తమ నైపుణ్యాన్ని ఉపయోగించి వేసిన రంగురంగుల రంగవల్లికలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన పండుగ విశిష్టతను, సంప్రదాయాలను ఈ తరం వారికి కూడా తెలియజేస్తూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. మన తెలుగు వారి ఆత్మీయతను, పండుగ ఉత్సాహాన్ని సైప్రస్ నగరంలో ప్రతిబింబించేలా చేసిన ప్రతి ఒక్కరిని చూస్తుంటే గర్వంగా ఉందని లాటా సభ్యులు పేర్కొన్నారు.






