Donald Trump: క్యూబాకు వార్నింగ్.. వెనిజులా నుంచి అన్నీ బంద్!
వెనిజులా అధ్యక్షుడిని బంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. మరో లాటిన్ అమెరికా దేశం క్యూబాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వెనిజులా నుండి ఇకపై క్యూబాకు చమురు గానీ, ఆర్థిక సాయం గానీ అందదని, కాబట్టి పరిస్థితి విషమించక ముందే అమెరికాతో ఒప్పందం (“Deal”) చేసుకోవాలని సూచించారు. “వెనిజులా నుండి క్యూబాకు ఒక్క చుక్క ఆయిల్ కూడా వెళ్లదు. సమయం మించిపోకముందే మాతో ఒప్పందం చేసుకోవడం మంచిది” అని ట్రంప్ (Donald Trump) తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు.
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన డెల్సీ రోడ్రిగెజ్పై ట్రంప్ తీవ్రంగా (Donald Trump) ఒత్తిడి తెస్తున్నారు. అక్కడి ఆయిల్ సహా సహజ వనరులపై యూఎస్‌కు గుత్తాధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వెనిజులా ఆయిల్‌ను క్యూబాకు బదులుగా అమెరికాకు పంపేలా చర్యలు తీసుకున్నారు. ఇన్నాళ్లు క్యూబాకు ప్రధాన చమురు సరఫరాదారుగా వెనిజులా (Venezuela) ఉంది. ఇప్పుడు ఆ సరఫరా ఆగిపోతే క్యూబా (Cuba) ఆర్థిక వ్యవస్థ, విద్యుత్ రంగం కుప్పకూలే ప్రమాదం ఉంది.
అమెరికా నిఘా వర్గాల (CIA) అంచనా ప్రకారం, క్యూబా ఇప్పటికే విద్యుత్ కోతలు, ఆంక్షలతో సతమతమవుతోంది. ఇప్పుడు వెనిజులా (Venezuela) సపోర్ట్ కూడా కోల్పోతే అక్కడి కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి పాలన కష్టతరమవుతుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే ట్రంప్ (Donald Trump) ఈ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.






