Supreme Court: సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న తెలంగాణ
పోలవరం (Polavaram), నల్లమల సాగర్(Nallamala Sagar) ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు (Supreme Court)లో రిట్ పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఫ్వీు (Abhishek Simphwi) వాదనలు వినిపించారు. పిటిషన్ డిస్పోజ్ ఆఫ్ చేసినట్లుగా సీజేఐ ప్రకటించారు. రిట్ పిటిషన్ వల్ల పిటిషన్‌కు ఎలాంటి ఉపయోగం ఉండదని సీజేఐ పేర్కొన్నారు. సూట్ దాఖలు చేస్తే అన్ని పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణనలోకి వస్తాయన్నారు.






