T20 World Cup: మళ్లీ వరల్డ్ కప్.. జూన్ 14న భారత్ వర్సెస్ పాకిస్థాన్!
క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో ఐసీసీ మెగా టోర్నీకి ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనున్న 10వ ఎడిషన్ ‘మహిళల టీ20 వరల్డ్ కప్’ (T20 World Cup) అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. జూన్ 12వ తేదీన మొదలయ్యే ఈ క్రికెట్ పండుగ.. జులై 5న ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. జూన్ 12న ఆతిథ్య ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో టోర్నీ లాంఛనంగా ప్రారంభం కానుంది.
రెండు గ్రూపులు.. 12 జట్లు:
ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. ఐసీసీ ఈ జట్లను రెండు గ్రూపులుగా విభజించింది.
గ్రూప్-ఎ: భారత్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్.
గ్రూప్-బి: ఇంగ్లండ్, న్యూజిలాండ్ (డిఫెండింగ్ ఛాంపియన్), శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్, స్కాట్లాండ్.

ఈసారైనా కప్పు కొట్టేనా?
క్రికెట్ ప్రపంచం (T20 World Cup) మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ హై-వోల్టేజ్ మ్యాచ్ జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనుంది. గత 2024 టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. గ్రూప్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో మాత్రమే గెలిచి, కనీసం నాకౌట్‌కు కూడా చేరలేకపోయింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో (T20 World Cup) 2020లో ఫైనల్ చేరడమే భారత్‌కు ఇప్పటివరకు అత్యుత్తమ ప్రదర్శన. అయితే ఈసారి వన్డే వరల్డ్ కప్ విజేతలుగా బరిలోకి దిగుతున్న భారత జట్టు.. రెట్టింపు ఉత్సాహంతో పొట్టి కప్‌ను కూడా ముద్దాడాలని పట్టుదలగా ఉంది. గత ఎడిషన్‌లో విజేతగా నిలిచిన న్యూజిలాండ్ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
భారత జట్టు మ్యాచ్‌ల షెడ్యూల్:
టోర్నీలో భారత్ ఆడనున్న మ్యాచ్‌ల వివరాలు, నాకౌట్ షెడ్యూల్ ఇలా ఉంది.
జూన్ 14: భారత్ vs పాకిస్తాన్ (సాయంత్రం 07:00, ఎడ్జ్‌బాస్టన్)
జూన్ 17: భారత్ vs నెదర్లాండ్స్ (సాయంత్రం 07:00, హెడింగ్లీ)
జూన్ 21: దక్షిణాఫ్రికా vs భారత్ (సాయంత్రం 07:00, ఓల్డ్ ట్రాఫోర్డ్)
జూన్ 25: భారత్ vs బంగ్లాదేశ్ (రాత్రి 07:00, ఓల్డ్ ట్రాఫోర్డ్)
జూన్ 28: ఆస్ట్రేలియా vs భారత్ (సాయంత్రం 07:00, లార్డ్స్)
జూన్ 30: సెమీ ఫైనల్-1 (సాయంత్రం 07:00, ది ఓవల్)
జూలై 2: సెమీ ఫైనల్-2 (రాత్రి 11:00, ది ఓవల్)
జూలై 5: ఫైనల్ (సాయంత్రం 07:00, లార్డ్స్)
ఇవి కూడా చదవండి






