ముంబైలో ముదురుతున్న వివాదం..? జట్టుకు దూరంగా హార్దిక్ ప్రాక్టీస్..!
ఐపీఎల్ 2026లో(IPL 2026) ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఎంత నిరాశాజనకంగా సాగిందో, ఆ జట్టు అంతర్గత వ్యవహారాలు అంతకంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) చేతిలో ఓడిపోయి ప్లేఆఫ్స్ రేసు నుండి అధికారికంగా నిష్క్రమించిన తర్వాతి రోజే ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. పంజాబ్ కింగ్స్‌తో(PBKS) జరగబోయే తదుపరి మ్యాచ్ కోసం ముంబై జట్టు ధర్మశాలకు చేరుకోగా, కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik pandya) మాత్రం జట్టుతో కలిసి వెళ్లలేదు. ఆయన ముంబైలోనే ఉండిపోయి, స్థానిక బౌలర్లతో ఒంటరిగా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్న విజువల్స్ సాషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
జట్టు మేనేజ్మెంట్ మరియు ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే తెలిపిన వివరాల ప్రకారం హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఈ కారణంగానే ఆయన గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారని, వైద్య బృందం సలహా మేరకే విశ్రాంతి తీసుకుంటూ ఫిట్నెస్ సాధించే ప్రయత్నం చేస్తున్నాడని మేనేజ్మెంట్ క్లారిటీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
అయితే క్రికెట్ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో మాత్రం మరో ప్రచారం బలంగా సాగుతోంది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ మరియు ఆటగాళ్లతో హార్దిక్‌కు తీవ్రమైన విభేదాలు వచ్చాయని, అందుకే అతను జట్టుతో కలిసి ప్రయాణించడం లేదని పుకార్లు వస్తున్నాయి.
హార్దిక్ అందుబాటులో లేకపోవడంతో సూర్య కుమార్ యాదవ్(Surya kumar Yadav) తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఒకవేళ ఈ విభేదాల వార్తలు నిజమైతే వచ్చే సీజన్లో హార్దిక్ ముంబై జట్టును వీడటం ఖాయమని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. దీనికి తోడు హార్దిక్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ముంబై ఇండియన్స్‌ను కాసేపు అన్‌ఫాలో చేసి, మళ్లీ ఫాలో అయ్యాడనే వార్తలు ఈ వివాదానికి మరింత నెయ్యి పోశాయి. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండటం ప్రస్తుతానికి అనుమానంగానే కనిపిస్తోంది.
అతను ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ, మెడికల్ టీమ్ నుండి క్లియరెన్స్ వస్తేనే నేరుగా ధర్మశాల చేరుకునే అవకాశం ఉంది. ఒకవేళ అతను కోలుకోకపోతే ఈ మ్యాచ్‌లోనూ సూర్యకుమారే జట్టును నడిపించనున్నాడు. అధికారికంగా గాయం కారణమే అని చెబుతున్నా, ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెరవెనుక ఏదో పెద్ద వివాదమే నడుస్తోందని స్పష్టమవుతోంది.
ఇవి కూడా చదవండి






