రాజ్యసభకు మళ్లీ పోటీచేయను
రాజ్యసభ ఎన్నికల్లో ఈ సారి పోటీచేయనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి తెలిపారు. రెండో దఫా ఆయన పదవీ కాలం ఆగస్టు నెలతో పూర్తవుతుంది. రెండు సార్లు మాత్రమే పోటీ చేయాలనేది మా పార్టీ నిబంధన. పార్టీ ప్రధాన కార్యదర్శిగా దాన్ని నేను అతిక్రమించకూడదని అని అన్నారు. ఆయన్ను పశ్చిమ్ బెంగాల్ నుంచి రాజ్యసభకు పంపేందుకు మద్దతిస్తామని కాంగ్రెస్ ముందుకు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంచి వక్త విపక్షంలో ఉండాలని కాంగ్రెస్ భావిస్తోందని పేర్కొన్నాయి.






