త్వరలో మళ్లీ ట్రంప్ టవర్ అమ్మకాలు
ముంబైలోని ట్రంప్ టవర్ అమ్మకాలు తిరిగి ప్రారంభంకానున్నాయి. 2019 నాటికి టవర్ మొత్తాన్ని విక్రయించాలని ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ సంస్థ లోధా గ్రూప్ ప్రకటించింది. సౌకర్యవంతమైన విల్లాల విక్రయ మార్కెట్లో లోధా గ్రూప్ ముందుంటుంది. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో టవర్ అమ్మకాలను ఆపివేశారు. మొత్తం 75 అంతస్థుల ఈ భవనంలో 60 శాతం ఇప్పటికే విక్రయించామని, మిగితా మొత్తాన్ని 2019 నాటికి పూర్తి స్థాయిలో విక్రయించాలనుకుంటున్నట్లు లోధా మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ లోధా తెలిపారు. ట్రంప్ విజయం సాధించిన వెంటనే ట్రంప్ టవర్ మొత్తాన్ని విక్రయించకూడదని మేం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే రాజకీయ పరమైన మార్పుల దృష్ట్యా ఇది ఎలాంటి సాంకేతాన్నైనా ఇవ్వొచ్చు అని ఆపేశాం అని ఆయన చెప్పారు. జూన్ లేదా జూలై నెలలో విక్రయాలు జరపాలని అనుకుంటున్నామని, అప్పుడే తగిన సమయం అని తాము భావిస్తున్నామని తెలిపారు.













