కడప టూ హైదరాబాద్ ట్రూజెట్ సర్వీసు
సామన్య ప్రజలకు విమాన ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో ఉడాన్ పథకాన్ని ప్రారంభించారని ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. సిమ్లాలో ప్రధాని మోడీ ఈ పథకానికి శ్రీకారం చుట్టగా, కడప విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు ఉడాన్ పథక కింద ట్రూజెట్ విమాన సర్వీసును ఆయన ప్రారంభించారు. తొలి రోజు విమాన ప్రయాణికులకు మంత్రి బోర్డింగ్ పాస్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హవాయ్ చెప్పులు వేసుకునే సామాన్యుడు కూడా విమానంలో ప్రయాణించాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ చొరవతో ఉడాన్ సర్వీసులను ప్రారంభించారన్నారు. భవిష్యత్తులో కడప నుంచి చెన్నై, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం కూడా సర్వీసులు నడపనున్నామని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.













