ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా గెహ్లాట్?
రాష్ట్రపతి రేసులో తాను లేనంటూ బీజేపీ కురవృద్దుడు అద్వానీ కొన్ని రోజుల క్రితం సృష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో పేరు తెరపైకి వచ్చింది. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్‌ను ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మధ్య ప్రదేశ్‌కు చెందిన గెహ్లాట్‌కు ఆరెస్సెస్‌తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయనను రాష్ట్రపతి చేస్తే, దళితుల వోట్లను కొల్లగొట్టవచ్చనేది బీజేపీ ఎత్తుగడగా చెబుతున్నారు.






