భాగ్యనగరంలో పరాభవ ఉగాది వేడుకలు
పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అమెరికా పర్యటన ముందు ఇండియాలో తెలంగాణ రాష్ట్రంలో, భాగ్యనగర్ నగరమునందు కల దిండిగల్ ఆశ్రమము లో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు పది రోజులు పాటు వైభవంగా జరిగాయి … ఉగాది పర్వదినాన సుమారు డెబ్బైవేల ముంది భక్తులు స్వామీజీవారి దర్శనం చేసుకుని సద్గురువుల ఆశీస్సులు పొందారు…
పరాభవ నామ సంవత్సరం ఏవిధంగా ఉండబోతుందో వివరించే పంచాంగ శ్రవణము భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రతి ఉగాదికి స్వామీజీ వారు నూతన భజనను ఆరపిస్తారని తెలిసిన విషయమే ఆరోజు కూడా ఉగాది పాటతో పాటు భజనలను భక్తులు భక్తి పారవశ్యంతో విని ఆనందించారు…. ఉదయాన్నే స్వామీజీ వారి దర్శనానంతరం ఉగాది పచ్చడి,లడ్డూ భక్తులందరికీ అందచేయబడ్డాయి.ఈపదిరోజులు నిరంతరాయంగా అన్న ప్రసాద వితరణ జరగటం విశేషం..
పరాభవ ఉగాది వేడుకల్లో సందర్భంగా గచ్చిబౌలి, ఇండోర్ స్టేడియం లో మార్చి 21వ తేదీ నాడు సుమారు పదివేలమంది మూడు గంటలపాటు భగవద్గీతనందలి ఏడు వందల శ్లోకాలు ఎంతో భక్తి,శ్రద్ధలతో పారాయణం పూజ్య శ్రీ స్వామీజీ వారి సమక్షంలో చేసినారు… వీరిలో దాదాపు ఐదువేలమంది అన్ని శ్లోకాలు కంఠస్తం చేయుట విశేషంగా చెప్పాలి ..

ఇందులో ఇంకొక విశేషమేమిటంటే, భగవద్గీత పారాయణం చేసిన వారు అందరూ కాషాయ రంగు దుస్తులు ధరిస్తే, భగవద్గీత కంఠస్థం చేసిన వారు నీలం రంగు వస్తాదారణ కావించారు… అదేరోజు సాయంత్రం సాయంత్రము ” సౌందర్యలహరి ” పారాయణ జరిగింది… పారాయణం చేసిన భక్తులందరికీ పూజ్య శ్రీ స్వామీజీ వారు ఆశీస్సులు అందజేశారు….
ఇందులో భాగంగానే పూజ్య శ్రీ స్వామీజీ వారు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం నందు ” మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ – భాగ్యనగర్ రాగ సాగర ” అనే concert నిర్వహించారు, సుమారు ఆరువేల మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులందరూ తన్మయత్వంతో ఆ దివ్యసంగీత జలనిధిలో ఓలలాడారు.
పూజ్య శ్రీ స్వామీజీ వారు ఇటువంటి మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ పేరుతో సంగీతసభలను దాదాపు 365 పైగా దేశ, విదేశాలలో నిర్వహించారు….
ఇక ఉగాది ముగింపు ఉత్సవాల్లో భాగంగా, శ్రీరామనవమినాడు అంటే మార్చి 27వ తేదీన శ్రీ సీతారాముల కల్యాణము అంగరంగ వైభవంగా , పూజ్య శ్రీ స్వామీజీ వారి అనుగ్రహ భాషణ తో జరిగింది.. పూజ్య శ్రీ స్వామీజీ వారు భక్తులు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు అందరూ కూడ సుఖశాంతులతో ఉండాలని ఆశీస్సులు అందజేశారు… భక్తులందరూ అన్ని కార్యక్రమంలోనూ , భక్తి శ్రద్ధలతో , క్రమశిక్షణతో పాల్గొనటం విశేషం… అన్ని కార్యక్రమాలలోనూ , కొన్ని వేల మందికి అన్న ప్రసాదాలతోపాటు ఎప్పటికప్పుడు మంచినీటిని అందజేశారు .. కార్యవర్గ సభ్యులు, నిర్వాహకులు, దత్త సేవాదళ్ స్వయం సేవకులు , అందరూ కలిసి అన్ని కార్యక్రమాల ఏర్పాట్లు ఘనంగా చేశారు.. ఏర్పాట్లలోఎటువంటి లోటుపాట్లు లేకుండా పదిరోజుల పాటు సాగిన ఈ కార్యక్రమాలకు భక్తులు విశేష సంఖ్యలో హాజరై శ్రీ స్వామీజీ వారి కృపకు పాత్రులయ్యారు…
జై శ్రీరామ్… జై గురుదత్త…..
చెన్నూరి సుబ్బారావు
ఇవి కూడా చదవండి






