హైదరాబాద్ లో టెట్రా మెడ్ సర్వీసెస్ సెంటర్
అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో గల టెట్రా గ్లోబల్ అనుబంధ సంస్థ టెట్రా మెడ్సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లో తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ సంస్థ కొత్త మాలిక్యూల్‌ను అభివృద్ధి చేయడంతో పాటు, రాబోయే 5-10 ఏళ్లకు అవసరమైన మాలిక్యూల్స్ పోర్ట్‌ఫోలియోను రూపొందించడంపై దృష్టి పెట్టింది. టెట్రా మెడ్సైన్సెస్ను రామ్ ఎస్ ఎయున్ని, లతా సుబ్రమణియన్ కలసి స్థాపించారు. మనుషులంతా ఆరోగ్యకర జీవితాలు గడిపేందుకు కొత్త మాలిక్యూల్ అభివృద్ధితో వైద్యం అందరికీ అందుబాటులో ఉండేలా చూసేందుకు దీనిని స్థాపించారు.
ఏపీఐలకు ఇంటర్మీడియట్లతో ప్రారంభించి, కొత్త మాలిక్యూల్ అభివృద్ధిపై కృషి చేస్తామని సంస్థ వ్యవస్థాపకురాలు లతా సుబ్రమణియం అన్నారు. ఇక్కడ నిపుణులు అధికంగా ఉండటంతో పాటు, ఫార్మా సంస్థలతో కలిసి పనిచేయడం సులభం అవుతుందని పేర్కొన్నారు. డైరెక్టర్ సునీత ఎయున్ని మాట్లాడుతూ కొవిడ్ 19 తర్వాత ఔషధ పరిశ్రమలో ఉత్పత్తిపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. ఏపీఐల కోసం చైనా మీద అధికంగా ఆధారపడటమూ ఇందుకు కారణమన్నారు. ఫార్మా హబ్ హైదరాబాద్‌లో తమ కొత్త పరిశోధన కేంద్రం భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్‌లో భాగం అవుతుందని తెలిపారు.






