తెలంగాణలో ఐదేళ్లలో రూ.5.9లక్షల కోట్ల పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పారిశ్రామికవర్గాలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి ఊహించనంతగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి మూడేళ్లలోనే దాదాపు రూ. 1,27,050 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించి రికార్డు సష్టించింది. పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఆ తర్వాత రెండేళ్లలో ఈ పెట్టుబడుల వాటా రూ. 5.9 లక్షల కోట్లకు పెరిగింది. రెండో విడత పాలన మొదలుపెట్టింది. నూతన పారిశ్రామిక విధానంతో పారిశ్రామికాభివద్ధిలో అమాంతంగా 79 శాతం వద్ధిరేటును సాధించి తన ఘనతను ప్రపంచానికి చాటిచెప్పింది.
అంతర్జాతీయ పరిశ్రమల ఏర్పాటుతో 5.38 లక్షల మందికి ఉపాధి అవకాశాలను లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి అందరి దృష్టిలో పడింది. ఐకియా, కోకాకోలా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్, చైనాకు చెందిన డాంగ్ పాంగ్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్, ఇన్సుమన్ ప్రాజెక్టు వంటివి లక్షలాది కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయి. వీటికి టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతులు, భూముల కేటాయింపు, నిరంతర విద్యుత్ అందజేత, ఇన్‌సెంటివ్‌లు వంటి వాటితో ప్రోత్సాహం కల్పించింది. దీంతో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోంది. కొత్త జిల్లాలతో అభివద్ధిని వికేంద్రీకరణ చేయవచ్చన్న ప్రభుత్వ అంచనాలు నిజమవుతున్నాయి. నూతన పారిశ్రామిక విధానం ద్వారా అత్యధికంగా మారుమూల జిల్లాల్లోనే పరిశ్రమలకు తెలంగాణ సర్కార్ అనుమతులను జారీ చేసింది. పెద్దపల్లి, వరంగల్‌లాంటి జిల్లాలు ఈ రంగంలో శరవేగంగా దూసుకుపోతున్నాయి.
పారిశ్రామిక కారిడార్‌గా, వాణిజ్య కేంద్రంగా ఉన్న పెద్దపల్లి ఈ ఐదేళ్లలో గణనీయ అభివద్ధిని సాధించింది. పారిశ్రామిక వికేంద్రీకరణ ఫలాలు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయని తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక పెట్టుబడుల సాధనలో రంగారెడ్డి జిల్లా కూడా ప్రగతిని సాధించింది. మొదటినుంచీ పారిశ్రామిక రంగంలో తనకున్న హవాను ఈ జిల్లా కాపాడుకుంది. ఈ జిల్లాలో 8వేలకుపైగా పరిశ్రమలు నూతనంగా అనుమతిని సాధించాయి. దేశీయ, విదేశీ పారిశ్రామిక వర్గాల్లో అపారమైన నమ్మకాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించడంతోనే ఈ ప్రగతి సాకారమైంది. శాంతిభద్రతలు, 24 గంటల నిరంతర విద్యుత్, ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ విధానాలు, అవినీతి రహిత అనుమతుల వంటివి పారిశ్రామిక వర్గాల్లో విశ్వాసం పెంచాయి. అంతర్జాతీయ పరిశ్రమల పెట్టుబడులకు ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఇచ్చిన పూర్తి భరోసా మరిన్ని పెట్టుబడులకు అనుకూలంగా మారింది.