Nitish Reddy: అమెరికా క్రికెటర్ నితీశ్ కు టీడీసీఏ సత్కారం

అమెరికా అండర్ -19 జట్టుకు ఎంపికైన తెలంగాణ క్రికెటర్ సూది నితీశ్‌రెడ్డి (Nitish Reddy) ని తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (టీడీసీఏ) అధ్యక్షుడు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి (Venkateswara Reddy ) ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక అకాడమీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న నితీశ్ రెడ్డిని కలిసి ఆయన అభినందించారు. తెలంగాణ క్రికెటర్లు నితీశ్‌ను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సుందర్ రెడ్డి, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.