స్పేస్ క్యూబ్డ్ తో టీ హబ్ ఒప్పందం

ఆస్ట్రేలియాలో స్టార్టప్‌లకు అవకాశాలను కల్పించేందుకు టీ హబ్ చర్యలు చేపట్టింది. ఆ దేశంలో ఉన్న ప్రముఖ నెట్‌వర్క్ కేంద్రమైన స్సేస్ క్యూబ్డ్‌తో ఇటీవల టీ హబ్ సీఐఓ సుజీత్ ఒప్పందం కుదుర్చుకొని పరస్పరం సంతకాలు చేసుకున్నారు. తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఔత్సాహికుల స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్న టీ హబ్, ఇతర దేశాల్లోనూ వాటికి వ్యాపార అవకాశాలు కల్పించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని టీ హబ్ సీఐఓ తెలిపారు. దేశ, విదేశాలకు చెందిన కార్పొరేట్ సంస్థలతోనూ ఇలాంటి భాగస్వామ్యాలు కుదుర్చుకొని, టీహబ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్టార్టప్‌లకు వ్యాపార అవకాశాలను పెంపొందించేలా టీహబ్ కృషి చేస్తోందని ఆయన తెలిపారు.