South Africa : దక్షిణాఫ్రికాలో జనగామ జిల్లావాసి మృతి

ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా వాసి అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొడకండ్ల మండలం రంగాపురం గ్రామానికి చెందిన గొడుగు శ్రీనివాస్ (52)( Srinivas) ఉపాధి కోసం ఈ ఏడాది జులై 24న దక్షిణాఫ్రికా(South Africa) దేశంలోని కాంగో రాష్ట్రం లుపోమాషి నగరానికి వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో పనికి కుదిరాడు. ఈనెలలో మలేరియా (Malaria ) రావడంతో కంపెనీలోని డాక్టర్లు ఇచ్చిన మందులు వాడారు. సరైన వైద్యం అందకపోవడంతో లివర్ ఇన్‌ఫెక్షన్ (Liver infection) తో ఈ నెల 25న మృతి చెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. చనిపోయి 4 రోజులైనా తమకు ఎలాంటి సమాచారం లేదని, మృతదేహం ఎప్పుడు వస్తుందో తమకు తెలియదని, ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.