KA Paul: పవన్ కల్యాణ్ జాగ్రత్త.. నేను ఒక్క ప్రార్థన చేస్తే చనిపోతావు : కేఏ పాల్
పవన్ కల్యాణ్ (Pawan Kalyan)జాగ్రత్త నేను ఒక్క ప్రార్థన చేస్తే రాజశేఖర్రెడ్డి (Rajasekhar Reddy)లా చనిపోతావు అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) శాపనార్థాలు పెట్టారు. హైదరాబాద్ ఆయన మాట్లాడారు. వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను ఓ దొంగలా రాత్రికి రాత్రే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిడ్నాప్ చేయించారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ ఎందుకు మౌనం పాటిస్తున్నారో అర్థం కావడం లేదు. అందరూ శాంతిని కోరుకుంటున్నారు. మూ డో ప్రపంచ యుద్ధం జరుగకుండా, అమెరికాలో చర్చించాం. నేను శాంతి కోసం ప్రార్థిస్తున్నా. గద్దర్ చనిపోలేదు చంపేశారు అని పాల్ చెప్పారు.






