ఇలినోయీలో ప్రభాకర్ రావు.. మియామీలో శ్రవణ్ రావు

స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్‌ఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులు ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, అరువుల శ్రవణ్ రావులను విదేశాల నుంచి రప్పించే దిశగా హైదరాబాద్ పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకు అవసరమైన రెడ్‌కార్నర్ నోటీసులు జారీ ప్రక్రియకు మార్గం సుగమం చేసుకున్నారు. అందులో భాగంగానే నిందితులిద్దరిపై నాంపల్లి కోర్టు ద్వారా సీఆర్‌పీసీ 73 సెక్షన్ కింద అరెస్టు వారెంట్ పొందారు. ప్రస్తుతం ప్రభాకర్‌రావు అమెరికాలోని ఇలినోయీలో, శ్రవణ్ రావు మియామీలో ఉన్నట్లు తెలియడంతో వారిని తమకు అప్పగించాలని అమెరికా ప్రభుత్వాన్ని కోరే పనిలో నిమగ్నమయ్యారు.