సెప్టెంబర్ 24న నోవాటేల్ లో మిసెస్ ఇండియా తెలంగాణ ఫ్యాషన్ షో…
వివాహిత మహిళల కోసం అతిపెద్ద వేదిక అయిన మిసెస్ ఇండియా తెలంగాణ, మమతా త్రివేది ఆధ్వర్యంలో 2023 గ్రాండ్ ఫినాలే కోసం 24 సెప్టెంబర్ 2023న జరగనున్నది. విలేకరులతో నిర్వహించిన్న కార్యక్రమంలో కిరీటాన్ని ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణను శ్రీమతి మమతా త్రివేదితో పాటు మిసెస్ ఇండియా తెలంగాణ మోడల్స్ మరియు స్పాన్సర్లు పాల్గొన్నారు.
ఈ ఫ్యాషన్ యొక్క థీమ్ చేనేతలను ప్రోత్సహించడం, పోచంపల్లి ఇక్కత్లో సృజనాత్మకంగా అలంకరించబడిన గ్రాండ్ ఫినాలే మోడల్స్ ర్యాంప్ వాక్ చేయనున్నారు. నేత కార్మికులకు మద్దతు ఇవ్వడం అని నిర్వహకులు తెలిపారు.
నేచురల్స్ COO, శ్రీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ, నేచురల్స్ మిసెస్ ఇండియా తెలంగాణతో మహిళా సాధికారత దార్శనికతను పంచుకుంటోందని మరియు 2020 నుండి వారితో భాగస్వామ్యాన్ని కలిగి ఉందని అన్నారు. శ్రీ శక్తి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ Ms సత్య పింజల, మిసెస్ ఇండియా తెలంగాణతో తమ సుదీర్ఘ అనుబంధం గురించి మాట్లాడారు. శ్రీమతి మమతా త్రివేది బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందుకు 120 ఏళ్ల యువ సంస్థ లాలాస్ గర్విస్తోందని శ్రీ రోహిత్ గుప్తా అన్నారు. ది డెంటల్ స్టూడియో నుండి డాక్టర్ యాషికా మెహతా, ఈ పోటీకి స్మైల్ పార్టనర్‌గా ఉన్నారు, డాక్టర్. కల్పన ప్రాతినిధ్యం వహిస్తున్న కస్తూరి హాస్పిటల్స్ మిసెస్ ఇండియా తెలంగాణ మహిళా ఆరోగ్య సంరక్షణ భాగస్వాములుగా ఉన్నారు.






