నేను పార్టీ మారడం లేదు : మల్లారెడ్డి

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. కుమారుడు భద్రారెడ్డితో పాటు ఆయన వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కేటీఆర్‌కు భద్రారెడ్డి తెలిపారు. మరోవైపు సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడంపై మల్లారెడ్డి వివరణ ఇచ్చారు. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన కళాశాల భవనాల కూల్చివేత అంశంపై కలిసినట్లు తెలిపారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. గత నెలలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్కాజిగిరి ఎంపీ స్థానానికి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అయితే భద్రారెడ్డి కేటీఆర్‌ను కలిసి పోటీ చేయడం లేదని తెలపడం ప్రాధాన్యం సంతరించుకుంది.