Kajal Aggarwal: రైతుల తరపున పోరాడనున్న చందమామ

ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలతో సక్సెస్‌ఫుల్ హీరోయిన్ గా కొనసాగిన టాలీవుడ్ చందమామ(chandamama) కాజల్ అగర్వాల్(kajal agarwal) కు ఇప్పుడు తెలుగులో అవకాశాలు తగ్గాయి. పెళ్లి చేసుకుని బాబు పుట్టాక కాజల్ కూడా ఒకప్పటిలా సినిమాలు చేయకుండా ఎంతో ఆలోచించి సినిమాలను ఓకే చేస్తుంది. అందులో భాగంగానే కాజల్ చేస్తున్న ఓ సినిమా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఎన్నో కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా చేసిన కాజల్ ఇప్పుడు తన రూట్ ను మార్చి సందేశాత్మక సినిమాలపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. సౌత్ సినిమాల్లో బాగా ఫేమస్ అయిన కాజల్ ఇప్పుడు ఎక్కువగా కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా ది ఇండియా స్టోరీ(The India Story) అనే సినిమాలో రైతుల తరపున పోరాడే లాయర్ గా కనిపించనుంది.
ది ఇండియా స్టోరీ సినిమాలో రైతుల సమస్యలు, పురుగుల మందుల డీలర్ల వల్ల వారికి ఎదురయ్యే సమస్యలపై మూవీ రూపొందనుండగా, ది ఇండియా స్టోరీలో రైతులు ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్లను చూపించనున్నారు. ఇవి కాకుండా కాజల్ రామాయణ(ramayana), ఇండియన్3(indian3) సినిమాలు చేస్తున్నప్పటికీ ది ఇండియా స్టోరీ మాత్రం వాటికి భిన్నంగా ఉంది. కాజల్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా విషయంలో చాలా ఎగ్జైటింగ్ ఉన్నారు. చేతన్ డీకే(Chethan DK) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా త్వరలోనే మేకర్స్ రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఇచ్చే వీలుంది.